Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక విధానాలు రూపొందిస్తుంది అని, అందులో భాగంగా ప్రభుత్వం ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందజేస్తుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన శస్త్రచికిత్సలు విభాగంలో మహిళలను పరామర్శించి వారికి పండ్లు అందజేసారు. అనంతరం శస్త్ర చికిత్సలు విభాగాన్ని
(థియేటర్) పరిశీలించారు. గతంలో ఆపరేషన్ చేయించు కోవాలంటే కొత్తగూడానికో లేక ఖమ్మానికో వెళ్ళాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆ ఇబ్బందీ లేదని మీ కృషితో మా లాంటి నిరుపేద మహిళలకు ఉచితంగా వైద్య సేవలు స్థానికంగానే అందుతున్నాయని, ఇక్కడ పని చేసే వైద్యులు మంచి వైద్య సేవలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేసారు. అనంతరం డి.సి.హెచ్.ఎస్ రవి బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఆపరేషన్ థియేటర్ ను, అందులో పరికరాలను సమకూర్చడం జరిగిందని, ఇందుకోసం ప్రత్యేక గ్రాంట్ రూ.35 లక్షలు మెచ్చా నాగేశ్వరరావు మంజూరు చేసారని అభినందించారు. రానున్న రోజుల్లో అశ్వారావుపేటలో వంద పడకల ఆసుపత్రిని తీసుకొస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు. అలాగే నూతనంగా నిర్మాణం అవుతున్న డయాలసిస్ బిల్డింగ్ పనులను త్వరగా పూర్తీ చేసేలా చర్యలూ తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఒ డాక్టర్ పూర్ణ చంద్, డాక్టర్ తిలక్, డాక్టర్ అరుణ్ కాంత్, డాక్టర్ భవ్య సుధ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, మండల నాయకులు మోహన్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.