Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అఖిల్ అభిమానులంతా 'ఏజెంట్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. వక్కంతం వంశీ అందించిన కథతో రూపొందిన ఈ సినిమాలో, అఖిల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాకి హిపాప్ తమిళ సంగీతాన్ని సమకూర్చాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. 'మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే' అంటూ ఈ పాట సాగుతోంది. ఫుల్ సాంగ్ ను రేపు రాత్రి 7:03 గంటలకు రిలీజ్ చేయనున్నట్టుగా తెలియజేశారు. లవ్ ను టచ్ చేస్తూ సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. అఖిల్ జోడీగా 'సాక్షి వైద్య' పరిచయమవుతుండగా, కల్నల్ పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు.