Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కీలక కమాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. హిజ్బుల్ కీలక కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ అలమ్‌ను పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కొత్తగా నియామకం అయ్యే ఉగ్రవాదులను కశ్మీర్‌కు తరలించడంలో బషీర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బషీర్‌ను ఐదు నెలల క్రితమే కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే బషీర్ ఇస్లామాబాద్‌లోని రావాల్పిండి ఏరియాలో ఫిబ్రవరి 20వ తేదీన ఓ దుకాణం ముందు నిల్చొని ఉండగా, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి పరారీ అయ్యారు. దీంతో బషీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బషీర్ స్వస్థలం ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని బద్ర్పోరా. బషీర్ 2000 సంవత్సరం నుంచి పాక్‌లో ఉంటూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడు. కుప్వారా ప్రాంతంలో జరిగే చొరబాట్లు, ఇతర ఉగ్రసంస్థలతో సమన్వయం చేసుకుంటూ బషీర్ దాడులకు పాల్పడేవాడు.