Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బస్టాండ్లో బ్యాగ్, మొబైళ్లు చోరీ కావటం వినే ఉంటాం. అయితే ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన బస్సును దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాలు... కల్యాణ కర్ణాటక రవాణాసంస్థ (కెకె ఆర్టీసీ) బస్సు చోరీకి గురైంది. కలబురిగి జిల్లా చించోళి బస్టాండ్లో బీదర్ డిపో-2కు చెందిన బస్ (కెఎ-38, ఎఫ్-971)ను సోమవారం రాత్రి నిలిపారు. మంగళవారం తెల్లవారుజామున బస్సును దుండగులు అపహరించారు. ఈ బస్సును ముగ్గురు వ్యక్తులు మిరియాణ, తాండూరు మార్గంలో తెలంగాణ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. చించోళి పోలీసులు ఆర్టీసీ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి బస్సు కోసం గాలింపు చేపట్టారు.