Authorization
Wed April 30, 2025 02:49:32 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కథానాయకుడు రామ్‌చరణ్ మరోసారి అమెరికాకి పయనమై వెళ్లారు. ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం సమీపిస్తున్న వేళ... అమెరికాలో జరుగుతున్న పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల సమయంలోనూ 'ఆర్ఆర్ఆర్' బృందంతో కలిసి కొన్నాళ్లపాటు అమెరికాలోనే గడిపారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపుని సొంతం చేసుకున్నారు రామ్‌చరణ్. ఇటీవల ఆయన నటనని ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయింది. రేసులో ఈ సినిమానే ముందంజలో ఉంది. మార్చి 12న జరిగే ఆస్కార్ ప్రదానోత్సవంలో రామ్‌చరణ్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. అంతకుముందే జరిగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలోనూ చరణ్ సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌చరణ్... శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా షెడ్యూల్ ముగిసింది.