Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ
ఛత్తీస్‌గఢ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. గన్నవరం విమానాశ్రయంలో బిశ్వభూషణ్‌కు సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం గవర్నర్ విజయవాడ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరి వెళ్లారు.
ఈ తరుణంలో సుమారు 44 నెలలపాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసేందుకు తనకు సహకరించిన అందరికీ బిశ్వభూషణ్ హరిచందన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని, అంతకుముందు బిశ్వభూషణ్ దంపతులకు రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది నుంచి తనకు లభించిన సహకారం వల్లే గత మూడున్నరేళ్లుగా రాష్ట్ర గవర్నర్‌గా ఫలవంతమైన పదవీకాలం కొనసాగిందన్నారు. ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి సమయంలో తనకు లభించిన సహకారం, మద్దతు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బిశ్వభూషణ్‌కు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్, రాజభవన్ సిబ్బంది జ్ఞాపికను అందజేసి సత్కరించారు.