Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధానికి దాదాపు ఏడాది పూర్తికావస్తున్న తరుణంలో ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానానికి ముందు కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. యుద్ధాన్ని ముగించేలా సాయం చేయాలని ఫ్రాన్స్ దౌత్యవేత్తలు భారత్ ను కోరారు. ఆ దేశ దౌత్య వర్గాల కథనం మేరకు ‘‘భారత్, రష్యా ప్రభుత్వాల మధ్య కీలక సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ సంబంధాలను వాడుకొని శాంతిని నెలకొల్పేలా సాయం చేయాలని భారత్‌ను కోరాం. కానీ, అది సుదీర్ఘ ప్రక్రియ’’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. భారత్-ఫ్రాన్స్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు దేశాలు అన్నిరకాల అంశాలపై చర్చించుకొంటాయని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
అయితే ఐరాసలో ఇప్పటి వరకు రష్యా చేపట్టిన యుద్ధాన్ని ఖండిస్తూ దాదాపు డజను సార్లు వివిధ తీర్మానాలు వచ్చాయి. భారత్ వీటికి దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఈ వారంలో రానున్న తీర్మానం విషయంలో భారత్ వైఖరిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.