Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వికారాబాద్
యాలాలలో పదో తరగతి విద్యార్థిని రఘుపతి అనే యువకుడు లైంగికదాడి చేశాడు. స్ధానికుల వివరాల ప్రకారం విహారయాత్ర కోసం స్కూల్ హెడ్మాస్టార్ వెంకటయ్య విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. తిరిగి అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు స్కూల్కు చేరుకున్నారు.
ఆ తరుణంలో బాలిక తల్లిదండ్రులు స్కూలుకు రాకపోవడంతో హెడ్మాస్టార్ రఘుపతి అనే వ్యక్తికి బాలికను అప్పగించి ఇంటిదగ్గర దిపాలంటూ సూచించారు. ఈ క్రమంలోనే రఘుపతి బాలికను కారులో తీసుకెళ్తు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. 2 రోజుల తర్వాత తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదే చేసిన పోలీసులు రఘుపతిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్మాస్టర్ వెంకటయ్యను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.