Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. ప్రస్తుతం సీబీఐ అరెస్టు చేసిన కేసులో బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నారు. ఆయనను రెండు రోజుల పాటు విచారించేందుకు ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి కోరారు.
ఈడీ విజప్తిపై స్పందించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ అనుమతించారు. ఈ తరుణంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి కీలక విషయాలు బుచ్చిబాబు నుంచి సేకరించాల్సివుందని ఈడీ అధికారుల సమాచారం.