Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
దేశ రాజధాని ఢీల్లీలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.
ఈ తరుణంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొత్త మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబేరాయ్కు ఢీల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు గెలిచారు. ఢీల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించిన కార్యకర్తలు, ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆప్ తొలి మేయర్ షెల్లీ ఒబేరాయ్కు హృదయపూర్వ అభినందనలు అని ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు.