Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలోని చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కళ్యాణమండపం దగ్గర పార్క్ చేసిన డీసీఎంలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ తరుణంలో గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ఈ తరుణంలోనే సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్లోని కూరగాయాల షాపులో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. దీనికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే దుకాణంలో మంటలు చెలరేగినట్లుగా అధికారులు తెలిపారు.