Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ - ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొమరాడ మండల పరిధిలోని కూనేరు- చోళ్లపదం ప్రధాన రహదారిపై పార్వతీపురం నుంచి రాయ్‌గఢ్ వెళ్తున్న లారీ, కూనేరు నుంచి కొమదాడ వస్తున్న ఆటో ఢీకొన్నాయి.
ఈతరుణంలో అంటివలస గ్రామానికి చెందిన నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. బాధితులు తుమ్మలవలస గ్రామంలో వివాహ వేడుకకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా లారీ ఢీకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.