Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో ఈ ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే భయాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. వీటితో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ట్రేడింగ్ చివరి వరకు సూచీలు పతనమవుతూనే వచ్చాయి. ఈ తరుణంలో లో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 927 పాయింట్లు నష్టపోయి 59,744కి పడిపోయింది. నిఫ్టీ 272 పాయింట్లు పతనమై 17,554కి నష్గాల్లోకి జారుకున్నాయి. దీంతో ఈరోజు అన్ని సూచీలు నష్టాల్లోకి వెళ్ళాయి.