Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆంధ్రప్రదేశ్
ఏపీ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయిన తరుణంలో జస్టిస్ (రిటైర్డ్) నజీర్ ఆంధ్రప్రదేశ్ మూడవ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఈ క్రమంలో నిన్న రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట మరికొందరు నేతలు, అధికారులు ఉన్నారు. ఈ నెల 24న ఆయన రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.