Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్ బేగంపేట దేవనార్ అంధ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడి అంధ విద్యార్థి మృతి చెందాడు. కేర్ టేకర్ బాత్రూమ్కి వెళ్లిన సమయంలో బిల్డింగ్ పైనుంచి విద్యార్థి లక్ష్మీగౌతమ్ శ్రీకర్ కిందపడిపోయారు. ఆరో అంతస్తు నుంచి 12 ఏళ్ల లక్ష్మీగౌతమ్ శ్రీకర్ పడిపోయినట్లు అక్కడ ఉన్న వారు చెబుతున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో బేగంపేట దేవనార్ అంధ పాఠశాలలోని తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. లక్ష్మీగౌతమ్ శ్రీకర్ మృతి విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, అంధ పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి లక్ష్మీగౌతమ్ బంధువులు, స్నేహితులు ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. బేగంపేట దేవనార్ అంధ పాఠశాలలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది ఇంకా స్పందించలేదు.