Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో రూ.100కోట్ల నుంచి రూ.200కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ కంపెనీ ప్రకటించింది. గైనకాలజీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ మెడిసిన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, హెమటాలజీ, యూరాలజీ విభాగాల్లో కంపెనీ సేవలందిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంజెక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. జీనోమ్ వ్యాలీలో దాదాపు పది ఎకరాల స్థాలాన్ని స్వాధీనం చేసుకున్నామని, కొద్ది రోజుల్లోనే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ఈ తరుణంలో సాధారణంగా ఇంజక్షన్ పాంట్ల్కు దాదాపు రెండు సంవత్సరాలు పడుతుందని ఎండీ సంజీవ్ నవాంగుల్ తెలిపింది. కంపెనీకి ఉత్తరాదిన మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఫెసిలిటీ ఉండగా ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా హైదరాబాద్‌లో ఫెసిలిటీని సర్వీస్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభం నుంచి కంపెనీ మోనోపాజ్ తర్వాత మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించే ప్రత్యేక ఔషధాలను తయారు చేస్తున్నట్లు తెలిపింది.