Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పశ్చిమ దేశాలు భారత్లో జరిగిన జీ20 ఆర్థిక మంత్రుల సమావేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించాయని రష్యా ఆరోపించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ సంక్షోభంపై సదస్సు నుంచి సంయుక్త ప్రకటన చేయించేందుకు విఫలయత్నం చేశాయని వెల్లడించింది. ‘‘జీ20 సదస్సులను అస్థిరపరిచేందుకు పశ్చిమ దేశాలు సమష్టిగా ప్రయత్నాలు కొనసాగిస్తుండటం బాధాకరం. ఈ క్రమంలో వారి అజెండాను వేదికపై రుద్దేందుకు యత్నిస్తున్నారు. ఇది కచ్చితంగా బెదిరింపే. ఉక్రెయిన్ సంక్షోభంపై వారి కోణంలోనే సంయుక్త ప్రకటన ఉండేలా లాబీయింగ్, అల్టిమేటంల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీలైనంత త్వరగా ఈ వినాశకర పాలసీని వదిలిపెట్టాలి. బహుకేంద్ర ప్రపంచం లక్ష్యాలను గుర్తించాలి. భద్రతా పరమైన అంశాలను ప్రోత్సహించకుండా.. జీ20ను ఆర్థిక వేదికగా ఉంచాలి’’ అని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. జీ20 సభ్యదేశాల ఆర్థిక మంత్రుల సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సందర్భంగా భారత్ ఓ నోట్ విడుదల చేసింది. ‘‘ చాలా మంది సభ్యులు ఈ సంక్షోభాన్ని బలంగా ఖండించారు. అక్కడి పరిస్థితిపై విభిన్నమైన అంచనాలు, ఆంక్షలు ఉన్నాయి’’ అని దానిలో పేర్కొంది.