Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్
కశ్మీరీ పండిట్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేశారు. పుల్వామా అచాన్ ప్రాంతంలో ఆదివారం ఉదయం మార్కెట్కు వెళ్తున్న సంజయ్ శర్మపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సంజయ్ శర్మ ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మార్కెట్కు వెళ్తుండగా ముష్కరులు అతనిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ తరుణంలో నిందితుల కోసం గాలిస్తున్నామని, ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.