Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి మొదటి రోజుతో పోలిస్తే మరింత క్షీణించిందని ఆమె తండ్రి నరేంద్ర తెలిపారు. ఈ తరుణంలో నిమ్స్ వద్ద ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ తమ కుమార్తె బతుకుతుందనే ఆశలు కనిపించడం లేదన్నారు. ప్రీతి శరీరం రంగు కూడా మారిపోతోందన్నారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తారని ఆశించినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశించాం కానీ, ఆశలు వదిలేసుకున్నాం. ప్రీతి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు.. బతికే అవకాశాలు లేవని వైద్యులు కూడా చెప్పారని తెలిపారు.