Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నగర శివార్లకు మరిన్ని ట్రిప్పులు బస్సులను నడుపుతామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. విద్యార్థులకు బస్సు సర్వీసుల నిర్వహణపై ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గోన్నారు.
ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం హైదరాబాద్ శివార్లలో బస్సు సర్వీసులను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 100 అదనపు బస్సు ట్రిప్పులను పరిశీలిస్తున్నామని తెలిపారు. “ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. మేము బాలికల కోసం ప్రత్యేక బస్సు సేవలను నిర్వహిస్తున్నాము మరియు ఈ బస్సు సర్వీసులు త్వరలో ప్రారంభమవుతాయి అని ఆయన వెల్లడించారు. అయితే ఈ నిర్ణయానికి కారణం శివార్లలోని బస్సుల్లో రద్దీపై అధికారులతో మాట్లాడి ప్రస్తుతం అందిస్తున్న బస్సు సర్వీసులపై ఆరా తీశానని బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు ట్రిప్పుల సంఖ్యను పెంచాలని టీఎస్ఆర్టీసీ ఎండీ అధికారులను ఆదేశించారు.