Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కోసం గర్భిణులు, బాలింతలు రాతపూర్వక అండర్ టేకింగ్ పత్రాన్ని సమర్పించే గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు వెంటనే డీజీపీ కార్యాలయంలోని ఇన్వర్డ్ సెక్షన్లో అండర్ టేకింగ్ అందించాలని అధికారులు సూచించారు. వీరికి నేరుగా మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కలుగుతుంది. నిర్ణీత గడువులోగా ఈవెంట్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే పోలీస్‌శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన గర్భిణులు, బాలింతలకు నేరుగా మెయిన్స్ రాసేందుకు పోలీస్ నియామక బోర్డు అవకాశం కల్పించింది.
ఈ మేరకు పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. శరీర దారుఢ్య పరీక్షలకు హాజరు కాలేని గర్భిణులు, బాలింతలు ఫిబ్రవరి 28 వరకు రాతపూర్వకంగా అండర్‌టేకింగ్ సమరర్పించాలని ఆయన సూచించారు. లక్డీకాపూల్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న పోలీస్ నియామక బోర్డు అధికారులకు అండర్‌టేకింగ్ సమర్పించాలన్నారు. అండర్ టేకింగ్ ప్రొఫార్మను నియామక బోర్డు వెబ్సైట్లో పొందుపర్చారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు నిర్ణీత గడువులోగా శరీర దారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.