Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రోజూ 11 నిమిషాల నడక వల్ల చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుందని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు. నడక గుండె జబ్బులు, కేన్సర్ ముప్పును తప్పిస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు వారి తాజా పరిశోధన ఫలితాలు ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.
పెద్దలు వారంలో కనీసం 150 నిమిషాలపాటు ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు, లేదంటే 75 నిమిషాలపాటు అత్యంత తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్మెచ్ఎస్) సిఫార్సు చేస్తోంది. అయితే, అంత అవసరం లేదని, అందులో సగం చేసినా ప్రతీ పది అకాల మరణాల్లో ఒకదానిని నివారించవచ్చని అధ్యయనంలో తేలింది. వారంలో 75 నిమిషాల పాటు ఓ మోస్తరు శారీరక శ్రమ వల్ల గుండె వ్యాధుల ముప్పు 17 శాతం, కేన్సర్ల ముప్పు 7 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.