Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రీస్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 57కు చేరింది. మంగళవారం రాత్రి థెస్సాలే-లారిస్సా నగరాల మధ్య ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి. ఏథెన్స్ నుంచి థెస్సాలేకి వెళ్తున్న ప్రయాణికుల రైలు.. తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును ఢీకొట్టింది. దీంతో చాలా బోగీలు పట్టాలు తప్పగా.. మరో మూడు బోగీలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ప్యాసింజర్ ట్రేన్ ప్రయాణిస్తున్నవారిలో ఇప్పటివరకు 57 మంది మరణించారు. వారిలో 36 మంది సజీవ దహణమయ్యారు. మరో 85 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో 350 మందికిపైగా ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.