Authorization
Wed April 30, 2025 07:26:25 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ పరిశ్రమల, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు బిగ్ షాక్ తగిలింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కం రైల్వే న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 ఏప్రిల్ 11వ తేదీన గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురు వైసిపి నాయకులు ప్రత్యేక హోదా రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ లోకి అనధికారికంగా ప్రవేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురిపై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో భాగంగా ఫిబ్రవరి 27వ తేదీన మంత్రి గుడివాడ అమర్నాథ్ కోర్టుకు హాజరు కాలేదు. ఈ తరుణంలోనే తాజాగా గుడివాడ అమర్నాథ్ కు నాన్వెలబుల్ వారంటూ జారీ చేసింది కోర్టు.