Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీలో ఈ నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 14న ఉదయం 10 గంటల నుంచి ఉభయసభలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ తరుణంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలనూ ఉద్దేశించి 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.