Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పట్నా
బిహార్లోని సీతామర్హి జిల్లా సొన్బర్సా బ్లాక్లో దారుణం వెలుగుచూసింది. పెండ్లి తంతు జరుగుతుండగా వేదికపైనే గుండెపోటుకు గురైన వరుడు కుప్పకూలిన ఉదంతం కలకలం రేపింది. ఇందర్వ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని అదే జిల్లాకు చెందిన సురేంద్రగా గుర్తించారు.
పెండ్లిలో వధూవరులు దండలు మార్చుకున్న కొద్దిసేపటికే సురేంద్ర వేదికపై కుప్పకూలాడు. పెండ్లికొడుకును హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే సురేంద్ర మరణించి ఉంటాడని వైద్యులు తెలిపారు. పెండ్లి వేదిక వద్దకు రాగానే మ్యూజిక్ సౌండ్ తగ్గించాలని సురేంద్ర కోరినా ఎవరూ వినిపించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. భారీ శబ్ధాలతో మ్యూజిక్ హోరెత్తించడంతోనే సురేంద్ర గుండెపోటుతో మరణించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.