Authorization
Fri May 02, 2025 02:24:45 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత మహిళల క్రికెట్‌కు సరికొత్త కళ వచ్చింది. 2018 నుంచి ఐపీఎల్ మధ్యలో మహిళల టీ20 చాలెంజ్ పేరిట మూడు జట్లతో మ్యాచ్‌లు జరిగిన విషయం అభిమానులకు తెలిసిందే. కానీ ఇప్పుడు జట్ల సంఖ్యను ఐదుకు పెంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) పేరిట పూర్తి స్థాయిలో లీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ నడుం బిగించింది. నేటి నుంచే ఈ ధనాధన్ పోరు షురూ కానుంది. శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ తలపడతాయి. హర్మన్, స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా ఘోష్‌లాంటి చిచ్చర పిడుగులతో పాటు మెగ్ లానింగ్, ఎలిస్ పెర్రీ, నాట్ స్కివర్, హీలీ, బెత్ మూనీ, ఎకెల్‌స్టోన్ లాంటి స్టార్లు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తలపడనుండగా.. వీటి మధ్య 22 మ్యాచ్‌లు జరుగనున్నాయి.