Authorization
Tue April 29, 2025 06:54:24 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
విశాఖ వేదికగా రెండు రోజులపాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్)లో 352 ఒప్పందాలు చేసుకున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సదస్సు ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తొలుత రూ.5 లక్షల కోట్లు వస్తాయని భావిస్తే అంతకుమించి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ తరుణంలోనే పరిశ్రమల వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. సదస్సు వల్ల ఏపీ సహజ వనరులు ప్రపంచానికి తెలిశాయి. సదస్సులో వంద దేశాల ప్రతినిధులు, ఏడు దేశాల రాయబారులు పాల్గొన్నారు అని అమర్నాథ్ తెలిపారు.