Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆక్రమణలు అంటూ పలు నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల తీరు పట్ల ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో, ఇప్పటం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ గుంపులుగా కనిపించవద్దని హెచ్చరించారు. ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు జరుగుతుండడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో స్పందించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్తులు భూమి ఇచ్చారన్న కక్షతోనే ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని, ఆ రోజు త్వరలోనే వస్తుందని అన్నారు.