Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13న జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్ష వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. 13న జరగాల్సిన పరీక్ష షెడ్యూల్ను 10వ తేదీలోగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్సెట్ తదితర కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వి. వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు.