Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాట్నా
బీహార్‌లో ఓ పెళ్లింట విషాదం నెలకొన్నది. డీజే సౌండ్ మోతకు వరుడి గుండె లయ తప్పింది. స్టేజిపైనే గుండెపోటు రావడంతో అతడు అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. ఈ సంఘటన సీతామర్హి జిల్లా మణితార గ్రామంలో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళితే, సురేంద్రకుమార్ (22) అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఇందర్వాలో పెండ్లి జరుగుతున్నది. వరుడు సురేంద్రకుమార్ స్టేజిపైకి రాగా, వధూవరులు దండలు మార్చుకొన్నారు. అదే సమయంలో అతడి మిత్రులు డీజే సౌండ్‌ను పెంచి, నృత్యాలు చేస్తున్నారు. దీంతో ఇబ్బందికి గురైన వరుడు సౌండ్ తగ్గించాలని పదేపదే కోరాడు. కానీ, అతడి మాటలు ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిసేపటికే వరుడు సురేంద్రకుమార్ అక్కడే కుప్పకూలిపోగా, కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు వరుడు మృతిచెందినట్టు నిర్ధారించాడు. పెండ్లి తర్వాత ఆనందోత్సాహాల నడుమ సురేంద్రకుమార్ బరాత్ జరుగాల్సిన రోజే శవయాత్ర నిర్వహించాల్సి రావడం అందరినీ కలిచివేసింది.