Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్లు మెగ్ లానింగ్(72), షెఫాలీ వర్మ(84) ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్నారు. ఢిల్లీ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండడంతో లానింగ్, షెఫాలీ పోటీ పడి పడ్డారు. ఈ తరుణంలో ప్రస్తుతం 20 ఓవర్లు ముగిశాయి. ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. కాప్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 39 పరుగులు చేయగా జెమీమా 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసింది.