Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన డిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (72), షఫాలీ వర్మ (84) అర్ధ శతకాలతో దూసుకుపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు 163/8కే పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో స్మృతి మంధాన (35), ఎల్లీస్ పెర్రీ (31), హీథర్ నైట్ (34), మెగన్ స్కట్ (30) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఢిల్లీ బౌలర్లలో తారా నోరిస్ ఐదు వికెట్లతో ఆకట్టుకోగా ఆలిస్ కాప్సే రెండు, శిఖా పాండే ఒక వికెట్ లను తమ ఖాతలో వేసుకున్నారు.