Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రస్తుతం ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 1996 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 1996 బ్యాచ్ ఎస్ఐలకు ఈ 26 ఏళ్లలో ఇన్స్పెక్టర్ ప్రమోషన్ మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. వీరంతా సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లుగా నేరుగా ఎంపికయ్యారని పేర్కొన్నారు. పదోన్నతి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్ పొందినవారిలో కొందరికి మాత్రమే డీఎస్పీలుగా పదోన్నతి కల్పించారని పేర్కొన్నారు. ఇంకా వంద మందికిపైగా ఇన్స్పెక్టర్లు డీఎస్పీ ప్రమోషన్ల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. 26 ఏళ్లలో వీరికి ఒక్కటే ప్రమోషన్ కల్పించడం పట్ల వారందరూ ఆందోళనతో ఉన్నారని, సొసైటీలో వారిని చిన్న చూపుచూసే అవకాశాలు ఉన్నాయని జగ్గారెడ్డి అన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచినందున.. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే వారు ఉండరని, ఖాళీలు ఏర్పడవని తెలిపారు.