Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పట్నా
బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రశ్నిస్తోంది. పట్నాలోని ఆమె నివాసంలో ఈ విచారణ జరుగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసులో సోమవారం సీబీఐ ఆమెను విచారిస్తోంది.
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ తరుణంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. గతేడాది అక్టోబరు 7న లాలూతోపాటు ఆయన భార్య రబ్రీదేవి, మరో 14 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది.