Authorization
Wed April 30, 2025 12:09:02 am
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రగతిభవన్ కు వెళ్లనున్నట్లు సమాచారం. నోటీసులపై ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించే అవకాశం ఉంది. గతంలో ఈడీ విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. మరోవైపు హైదరాబాద్ లోని కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అక్కడ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎవరినీ ఇంటి లోపలికి అనుమతించడం లేదని సమాచారం. ఇప్పటికే లిక్కర్ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు.