Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సీఎం కేసీఆర్ అధికార నివాసానికి వెళ్లారు. కవితతో మాట్లాడేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు బయట మీడియా ప్రతినిధులు ఎదురుచూశారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌తో ఈ నెల 10న ఢిల్లీ (Delhi)లో జంతర్‌మంతర్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రధానంగా ఈ నెల 13 నుంచి జరిగే సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ దీక్షలో అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానాలు పంపారు. ప్రతి ఒక్కరికి వారి జనాభా ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉప కోటా ఉండాలన్నదే తమ ఆకాంక్షతో కేంద్రాన్ని కవిత డిమాండ్ చేస్తున్నారు.