Authorization
Wed April 30, 2025 01:07:33 am
నవతెలంగాణ - న్యూఢిల్లీ: గూగుల్ తన తొలి పిక్సెల్ ట్లాబ్లెట్ లాంఛ్ డేట్‌ను అధికారికంగా వెల్లడించింది. గూగుల్ ఐఓ 2023 ఎడిషన్ మే 10న లాంఛ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. అప్‌కమింగ్ ఈవెంట్లో గూగుల్ తొలి పిక్సెల్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించనుంది. గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ ప్రొప్రైటరీ గూగుల్ టెన్సర్ ఎస్ఓసీ చిప్సెట్తో రానుందని కంపెనీ ఇప్పటికే తెలిపింది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 12ఎల్ లేదా ఆండ్రాయిడ్ 13ఎల్పై రన్ అవుతుంది. ఎల్ఈడీ సపోర్ట్ లేకుండా గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ వెనుకభాగంలో సింగిల్ కెమెరాను కలిగిఉంటుంది. మెరుగైన గ్రిప్, యాక్సిడెంటల్ టచెస్ను నివారించేందుకు డిస్ప్లే థిక్‌గా ఉంటుందని చెబుతున్నారు. పోస్టర్లో గ్రీన్ కలర్ మోడల్‌ను ప్రదర్శించారు. పిక్సెల్ ట్యాబ్లెట్ స్పెషల్ చార్జింగ్ డాక్‌తో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు కుబా వొజిచౌస్కీ అంచనా వేశారు.
లేటెస్ట్ పిక్సెల్ 7 లైనప్‌లో వాడుతున్న గూగుల్ టెన్సర్ జీ2తో పిక్సెల్ ట్యాబ్లెట్ కస్టమర్లను ఆకట్టుకోనుందని చెబుతున్నారు. ట్యాబ్లెట్ వెనుకభాగంలో అల్ట్రా వైడ్‌యాంగిల్ కెమెరా, ముందుభాగంలో సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. పిక్సెల్ ట్యాబ్లెట్ గూగుల్ యూఎస్ఐ 2.0 స్టైలస్ సపోర్ట్‌తో 10.95 ఇంచ్ స్క్రీన్ డిస్ప్లే కలిగిఉంటుంది. పిక్సెల్ ట్యాబ్లెట్ మిని, ప్రొ మోడల్స్‌తో 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.