Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది.
సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విచారణ జరపాలని డీజీపిని ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించనున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో బండి సంజయ్ స్పందించారు. తనకు ఇంకా మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందలేదన్నారు. ఒకవేళ నోటీసులు వస్తే తప్పకుండా కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని ప్రకటించారు.