Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో 15, నాగర్‌కర్నూల్‌లో 14, వనపర్తిలో 7, జోగులాంబ గద్వాల్లో 11, నారాయణ పేట్లో 5, రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలు, వికారాబాద్‌లో 18 పోలింగ్ కేంద్రాలు, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 14 పోలింగ్ కేంద్రాలు, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మొత్తం 29,720 మంది ఓటర్లకు గాను 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 126 ప్రధాన పోలింగ్ కేంద్రాలు, 11 అదనపు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 29,720 మంది ఓటర్లలో 15,472 మంది పురుషులు, 14,246 మంది మహిళలు, 2 మంది ఇతరులు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని 739 మంది పోలింగ్ అధికారులు నియమించారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి 137 మంది పీఓలు, 137 మంది పీపీఓలు, 319 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 593 మందిని నియమించగా అందులో 146 మంది రిజర్వ్‌లో ఉన్నారు. 29 మంది పీఓలు, 30 మంది ఏపీఓలు, 87 మంది పోలింగ్ సిబ్బంది రిజర్వ్‌లో ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 16న సరూర్‌నగర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది.