Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ నిమిత్తం వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ ముందు ఆదివారం హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు ఇప్పటికే మూడుసార్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ ఇప్పుడు ఆయన తండ్రి భాస్కరరెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ నెల 13 వరకు అరెస్టు కాకుండా అవినాష్‌రెడ్డి తాత్కాలిక ఉపశమనం పొందారు. ఈ కేసులో భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి అనుమానితులుగా ఉన్నారని వారిని అదుపులోకి తీసుకోవాలని ఈ నెల 24న నిర్ణయించామని సీబీఐ తరఫున న్యాయవాది శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ ఆదివారం ఉదయం 10 గంటలకు కడప కేంద్ర కారాగారంలో విచారణకు రావాలని పిలిచింది.