Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇండోనేషియా
జావా ద్వీపంలో ఉన్న మౌంట్ మెరాపీ అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భారీగా లావా, బూడిద, వేడి వాయువులు వెలువడుతున్నాయి. విస్ఫోటనం ధాటికి గాలిలో వంద మీటర్ల ఎత్తు వరకు ధూళి మేఘాలు ఆవరించాయి. ఈ క్రమంలో అగ్నిపర్వతం నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో వాయువులు వ్యాప్తిచెందాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధికార ప్రతినిధి అబ్దుల్ ముహరీ తెలిపారు.