Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కటక్
ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లా వద్ద లభించిన గూఢచారి పావురం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసు కమ్యూనికేషన్ విభాగం దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో డీఎన్ఏ పరీక్ష ద్వారా దాని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పావురానికి అమర్చిన కెమెరా, మెమొరీ చిప్‌పై ఇప్పటికే భువనేశ్వర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో దర్యాప్తు కొనసాగుతోంది. పావురం రెక్కలపై విదేశీ భాషలో రాసి ఉన్న అక్షరాలపైనా దర్యాప్తు చేస్తున్నారు. పావురం పొడవు, శరీరం శైలి పరిశీలిస్తే అది ఏ ప్రాంతానికి చెందిందో తెలుస్తుందని పోలీసు పావురాల విభాగం మాజీ అధికారులు అంటున్నారు. ఇది శిక్షణ పొందిన పావురమని అనుమానిస్తున్నారు. వివరాలు సేకరించాక, తిరిగి పంపినవారి వద్దకు చేరుకుంటుంది. కొత్తగా శిక్షణ పొందినది కావడం వల్ల తిరిగివెళ్లే దిశ మరిచిపోయి, సముద్ర ప్రాంతంలో తిరుగుతూ మత్స్యకారుల చేతికి చిక్కిందని చెబుతున్నారు.