Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా సమీపంలో శనివారం అర్థరాత్రి రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. రైలు హౌరా నుంచి న్యూ జల్పైగురి వెళ్తోంది. ఈ ఘటనలో రైలు బోగీ కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయని తూర్పు రైల్వే ఓ ప్రకటనలో తేలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల వరసగా దాడులు జరుగుతున్నాయి. జనవరి నెలలో డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సీదేవా ప్రాంతానికి సమీపంలో రెండు కోచ్లపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తెలిపింది. ఆ తరువాత మాల్దా సమీపంలోని హౌరా నుండి న్యూ జల్పైగురికి వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. జనవరి నెలలో ఇది రెండో దాడి. తాజాగా మరోసారి ముర్షిదాబాద్ లో మరోసారి దాడికి గురైంది.