Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ తరుణంలో అమరులకు నివాళులర్పించిన అమిత్ షా సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ క్రమంలో 53 ఏండ్లుగా దేశ సేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తున్నదని, దేశాన్ని రక్షించడంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సాధించిన విజయాలకు భారతదేశం గర్విస్తుందన్నారు. విధుల్లో భాగంగా చాలా మంది సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారన్నారు. సీఐఎస్ఎఫ్కి అవసరమైన సాంకేంతిక పరిజ్ఞాన్ని సమకూర్చడంలో అన్నిరకాలుగా సహకారం అందిస్తామన్నారు.