Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహారాష్ట్ర
ఛత్రపతి సంభాజీనగర్ పరిధిలో దేవదర్శనానికి వెళ్లిన నలుగురు భక్తులు గోదావరిలో గల్లంతైయ్యారు. దేవదర్శనానికి వచ్చిన భక్తులంతా గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి నీటిలోకి దిగాడు. నీటి లోతును ఊహించకుండా దిగడంతో ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ముగ్గురు నీటిలోకి దూకారు. ప్రవాహ తాకిడి ఎక్కువగా ఉండడంతో నలుగురూ నదిలో కొట్టుకుపోయారు. వీరిలో ఎవరి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ నలుగురి కోసం పోలీసులు అర్థరాత్రి వరకు వెతికారు. వారికోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు.