Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట మొదలైంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 289/3తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా కాసేపటికే రవీంద్ర జడేజా (28) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. మర్ఫీ బౌలింగ్లో షాట్ కొట్టడానికి ప్రయత్నించిన జడేజా మిడాన్లో ఖావాజా చేతికి చిక్కాడు. ప్రస్తుతం టీమ్ఇండియా 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. క్రీజ్లో విరాట్ కోహ్లీ (76), శ్రీకర్ భరత్(18) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులు వెనకబడి ఉంది.