Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
నేడు కర్ణాటకలో ప్రధాని మోడి పర్యటించనున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టుల ఒపెనింగ్ తో పాటు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. జేడీఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మాండ్యాలో ఈ రోజు మైసూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో పాటు హుబ్బళ్లి-ధార్వాడ్ జిల్లాల్లో దాదాపు 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మండ్యాలో రోడ్ షో నిర్వహించనున్నారు.
మైసూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 118 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని రూ. 8480 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది బెంగళూర్, మైసూర్ నగరాల మధ్యనేడు కర్ణాటకలో ప్రధాని పర్యటన.. పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం ప్రమాణ సమయాన్ని 3 గంటల నుంచి కేవలం 75 నిమిషాలకు తగ్గనుంది. మైసూరు-ఖుషాల్‌నగర్ 4 లేన్ హైవేకి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 92 కి.మీ.లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ సుమారు రూ. 4130 ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి వల్ల బెంగళూర్, ఖుషాల్ నగర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతోంది. ధర్వాడ్ లో ఐఐటీని ప్రారంభించనున్నారు. హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.