Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
ఐదేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు బాలీవుడ్ నటుడు, వ్యాఖ్యాత, ది కపిల్‌శర్మ షో ఫేమ్ కపిల్‌శర్మ తెలిపాడు. ఆ సమయంలో తాను మానసిక సంఘర్షణకు లోనయ్యానని దానిని ఎలా జయించాలో అర్థం కాక చచ్చిపోవాలనుకున్నానని వెల్లడించాడు. కావాల్సినంత డబ్బు, ఫేమ్, చుట్టూ ఎంతోమంది స్నేహితులు ఉన్నప్పటికీ తాను ఒంటరితనాన్ని అనుభవించానంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు.
అయితే 2017లో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఫీలింగ్స్‌ని పంచుకోవడానికి నా పక్కన ఎవరూ లేరనిపించింది. ఇది నాకు కొత్తేమీ కాదు. మానసిక ఒత్తిడిపై పెద్దగా అవగాహన లేని చోటు నుంచి నేను వచ్చాను. చిన్నతనంలోనే ఎన్నో సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యాను. డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు యోగక్షేమాలు చూసుకోవడానికి ఎవరూ లేనప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదుటి వ్యక్తుల ఉద్దేశాలు అర్థంకాక ఒంటరిగా అయిపోయినట్టు ఉంటుంది. నటీనటులకు ఇలాంటి ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం తెలుసుకున్నాను అన్నారు.