Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
ప్రముఖ నటి మాధురి దీక్షిత్ మాతృమూర్తి స్నేహలతా దీక్షిత్ (91) కన్నుమూశారు. ముంబైలోని ఆమె స్వగృహంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. మాధురి, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఈ విషయాన్ని వెల్లడించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె తుదిశ్వాస విడిచారు అని తెలిపారు. వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3.00 గంటలకు స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.